![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో సోమవారం నామినేషన్ల ప్రక్రియ ఫుల్ ఆసక్తికరంగా సాగింది. కానీ సుమన్ శెట్టి చేసిన నామినేషన్ నెక్స్ట్ లెవెల్ అంతే. అంతగా హౌస్ మేట్స్ ఎప్పుడు నవ్వలేదు. నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి తన మొదటి నామినేషన్ గా రీతూని చేశాడు. ఆ వివరాలు ఓసారి చూసేద్దాం.
రీతూ నువ్వు హౌస్‌లో గట్టిగట్టిగా అరుస్తావ్.. నాకు అది ఇబ్బందిగా ఉందని సుమన్ శెట్టి తన పాయింట్ చెప్పాడు. నేను, మీరు ఒకేలా మాట్లాడం కదా అన్నా.. దానికి నేనేం చేయాలి.. మిగిలిన వాళ్లకి కూడా ఇబ్బంది అయితే వాళ్లు చెప్పుండేవాళ్లు కదా అని రీతూ అడుగుతుంది. వాళ్ళకి భయమేమో చెప్పలేదు కానీ నాకు భయం లేదు అందుకే చెప్తున్నానని సుమన్ శెట్టి అన్నాడు. ఇక ఆ తర్వాత డీమాన్ పవన్ ని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. ఇక తన కారణం చెప్పాడు. నీకు దెబ్బ తగిలింది కదా పవన్.. నువ్వు ఇంటికెళ్లిపోయి రెస్ట్ తీసుకోమని సుమన్ అనగానే డీమాన్ తో పాటు హౌస్ అంతా ఫుల్ నవ్వుకున్నారు.
నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి కానీ నీకు రెస్ట్ అవసరం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని సుమన్ శెట్టి అంటాడు. అదేంటన్నా స్ట్రాంగ్ అంటే ఉండాలి కదా అని డీమాన్ అన్నాడు. నీకు హెల్త్ బాలేదు కదా వెళ్ళిపోమని సుమన్ శెట్టి అనగానే కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ అయితే పగలబడి నవ్వుకున్నారు. భరణి, తనూజ అయితే నవ్వలేక మొహం కప్పేసుకున్నారు. సుమన్ శెట్టి చేసిన ఈ నామినేషన్ తో హౌస్ అంతా ఫుల్ హ్యాపీగా నవ్వుకున్నారు. ది బెస్ట్ నామినేషన్ గా సుమన్ శెట్టి నామినేషన్ నిలిచిపోతుంది.
![]() |
![]() |